రాజయ్యకు రాం..రాం.. !!
తెలంగాణ తొలి కేబినేట్ తొలి వికెట్ పడేటట్లు కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. రాజయ్య కు రాం.. రాం.. పలికే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వున్నట్లు సమాచారమ్. సడెన్ రాజయ్యకు మంగళం పాడకున్నా.. సమయాన్ని చూసి చెక్కె పెట్టే యోచనలో కేసీఆర్ వున్నారు.వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంపై ముఖ్యమంత్రి నేరుగా ఆగ్రహం వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి ప్రమేయంతో నియమితులైనట్లుగా చెబుతున్న ముగ్గురు ముఖ్య అధికారులపై వేటు వేయడంతో సీఎం తదుపరి చర్య రాజ్యయ్యను రాజీనామా కోరడమేనని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రాజయ్యకు ఓమారు హెచ్చరికలు చేసినట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి. అయినా.. రాజయ్య తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సారి స్వయంగా ముఖ్యమంత్రినే రంగంలో దిగడంతో.. రాజయ్యకు రాం.. రాం.. తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.మొత్తానికి.. తెలంగాణ రాష్ట్రంలో తొలి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిగా రాజయ్య రికార్డులకెక్కనున్నాడన్న మాట. మరి.. రాజయ్యకు వెంటనే రాం.. రాం.. పలుకుతారా.. ? మరికొద్ది రోజులు వేచి చూస్తారా.. ? అన్నది త్వరలోనే తేలనుంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








